: అక్కడ గోడలపై నినాదాలు రాస్తే.. 50 వేల జరిమానా!
ఎన్నికల్లో భాగంగా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు తమ నినాదాలను ప్రభుత్వ భవనాలు, గోడలపై రాస్తే కఠిన చర్యలు తప్పవని అనంతపురం జిల్లా కలెక్టర్ డి.ఎస్.లోకేష్ కుమార్ హెచ్చరించారు. కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. అనుమతి లేకుండా గోడల పైన, బిల్డింగుల పైన గానీ నినాదాలు, ప్రకటనలు రాస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. అలా చేస్తే 50 వేల రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుందని ఆయన చెప్పారు.