: రాజ్యసభలో ప్రధాని ప్రకటించినవి ఆరు సూత్రాలు కాదు ... ఆరు ఉరి తాళ్లు: పయ్యావుల
రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రకు కేటాయించిన సూత్రాలు, ప్యాకేజీలపై టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. రాజ్యసభలో సీమాంధ్రకు ప్రధాని ప్రకటించింది ఆరు సూత్రాలు కాదని.. ఆరు ఉరి తాళ్లని విమర్శించారు. మరి ఆ ఆరు సూత్రాల ప్యాకేజీలో సీమాంధ్రకు నిధుల కేటాయింపు గురించి ఒక్కమాటా చెప్పలేదన్నారు. హిమాచల్ ప్రదేశ్ తరహాలో సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజ్ అంటూ జైరాం రమేశ్ విష ప్రచారం చేస్తున్నారన్నారు. తెలుగుజాతి నాశనానికి కారకుడైన జైరాం.. ఇప్పుడు వందమాటలు చెబుతున్నాడన్నారు. సీమాంధ్రకు తొలి ఏడాది రెవిన్యూ లోటు కేంద్ర బడ్జెట్ ద్వారా భర్తీ చేస్తాం అంటున్నారన్న పయ్యావుల, మరి తర్వాత తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వచ్చే ఏడాది నుంచే సీమాంధ్ర ప్రాంతాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తారా? అని నిలదీశారు.