: అక్బరుద్దీన్ పై దాడి కేసులో ముగ్గురికి బెయిల్ నిరాకరణ
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై దాడికి పాల్పడిన నిందితులకు హైకోర్టు నేడు బెయిల్ నిరాకరించింది. 2011 మే నెలలో అక్బరుద్దీన్ పై మహ్మద్ పహిల్వాన్ కుటుంబీకులు పాత కక్షల నేపథ్యంలో కత్తులు, తుపాకులతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అక్బర్ క్రమంగా కోలుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ పహిల్వాన్, యూనస్ బిన్ ఒమర్, మున్వర్ ఇక్బాల్ ల బెయిల్ పిటిషన్లపై నేడు విచారించిన కోర్టు వారి పిటిషన్లు సమంజసంగా లేవని పేర్కొంది.