: ఇంటి గోడ కూలి.. ఐదుగురు కుటుంబీకులు దుర్మరణం


ఓ ఇంటి గోడ ప్రమాదవశాత్తు కూలి.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ మణిపురి జిల్లాలో జరిగింది. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

శిథిలాల కిందనున్న మృత దేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. విర్మాదేవి (70), మీనాదేవి(35), ఆమె కొడుకు రాహుల్ (17), ఇద్దరు బాలికలు శశి(14), శివాని (9)గా పోలీసులు గుర్తించారు. బాధిత కుటుంబానికి లక్షన్నర రూపాయల పరిహారం ఇస్తున్నట్లు జిల్లా మేజిస్ట్రేట్ వీకే పన్వర్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News