: రవీంద్రనాథ్ రెడ్డికి లై డిటెక్టర్ పరీక్షలపై పిటిషన్ తిరస్కరణ


కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డికి లై డిటెక్టర్ పరీక్షలు చేసేందుకు అనుమతివ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను నేడు కోర్టు తోసిపుచ్చింది. పెద్ద తెప్పలి సహకార సంఘం ఎన్నికల సందర్భంగా అధికారుల సంతకాలను రవీంద్రనాథ్ రెడ్డి ఫోర్జరీ చేశారని కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే.

విచారణకు రవీంద్రనాథ్ రెడ్డి సహకరించడం లేదని,  లై డిటెక్టర్ పరీక్షలకు అనుమతివ్వాలని గతంలో పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా కోర్టు ఈనెల 19 న విచారణ జరిపింది. అయితే, తీర్పును నేటికి వాయిదా వేశారు. 

  • Loading...

More Telugu News