: కాంగ్రెస్, బీజేపీల వల్లే సీమాంధ్రకు లాభం చేకూరింది: సి.రామచంద్రయ్య


విభజన విషయంలో టీడీపీ, వైకాపాలు రెండూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని మంత్రి సి.రామచంద్రయ్య అన్నారు. సీమాంధ్రకు ఏదైనా లాభం చేకూరిందంటే... అది కాంగ్రెస్, బీజేపీలవల్లే అని స్పష్టం చేశారు. ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించవచ్చని సూచించిన జగన్, ఇప్పుడు విమర్శలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా సీమాంధ్ర అభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరం ఉందని... లేకపోతే భవిష్యత్ తరాలు క్షమించవని తెలిపారు.

  • Loading...

More Telugu News