: ప్రతి హిందూ జంట ఐదుగురు బిడ్డల్ని కనాలి: వీహెచ్ పీ


మతమార్పిడి అంశంపై విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా స్పందించింది. ప్రతి హిందూ జంట ఐదుగురు బిడ్డల్ని కనాలని వీహెచ్ పీ కన్వీనర్ అశోక్ సింఘాల్ పిలుపునిచ్చారు. మతమార్పిడులను అరికట్టకపోతే భవిష్యత్తులో హిందువులు మైనారిటీ వర్గంగా మిగిలిపోతారని ఆయన హెచ్చరించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. హిందువులు మైనారిటీలుగా మారకూడదనుకుంటే ప్రతి జంట ఐదుగురు బిడ్డలను కనడం తప్పనిసరి అని సింఘాల్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీకి కచ్చితంగా మద్దతిస్తామని తెలిపారు. మోడీ ప్రధానిగా ప్రభుత్వం ఏర్పడితే అమెరికా ఒత్తిళ్ళకు తలొగ్గాల్సిన పని ఉండదని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News