: కాంగ్రెస్ ను ఎన్నటికీ సీమాంధ్రులు క్షమించరు: రాయపాటి
రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ ను సీమాంధ్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ రెండు కలసి రాష్ట్రాన్ని విభజించాయని విమర్శించారు. బహిష్కృత ఎంపీలమందరం రేపు కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ కానున్నామని చెప్పారు. ఈ క్రమంలో నెలాఖరుకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని రాయపాటి వెల్లడించారు.