: ఉసూరుమనిపించిన యువ బ్యాట్స్ మెన్
అండర్-19 వరల్డ్ కప్ లో భారత యువ బ్యాట్స్ మెన్ పేలవ ప్రదర్శన కనబరిచారు. ఇంగ్లండ్ తో క్వార్టర్ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన కుర్రాళ్ళు 50 ఓవర్లలో 8 వికెట్లకు 221 పరుగులు చేశారు. హుడా (68) టాప్ స్కోరర్. ఎస్ఎన్ ఖాన్ (52 నాటౌట్), కెప్టెన్ విజయ్ జోల్ (48) రాణించారు. ఇక లక్ష్య చేధనలో ఇంగ్లండ్ జట్టు 7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది.