: తెల్ల రేషన్ కార్డుదారులకు స్విమ్స్ ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో పాలక మండలి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి 2,401 కోట్ల రూపాయలతో బడ్జెట్ ను రూపొందించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు వాహనాల తయారీ కోసం 8.5 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు.
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్ ఆసుపత్రి)లో తెల్లరేషన్ కార్డులు కలిగి ఉన్నవారికి వైద్యసేవలను ఉచితంగా అందించాలని పాలక మండలి నిర్ణయించింది. టీటీడీ శిల్ప కళాశాలలో పనిచేస్తున్న కళాకారులకు లక్ష రూపాయలను డిపాజిట్ చేయాలని తీర్మానించారు. బర్డ్స్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగించారు.