: తెలంగాణకు అన్యాయం జరిగింది: గండ్ర
రాష్ట్ర విభజనతో తెలంగాణకు అన్యాయం జరిగిందని చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. తెలుగు ప్రజల మధ్య సఖ్యత కోసమే సీమాంధ్రకు ప్యాకేజీని ప్రకటించారని చెప్పారు. తెలంగాణకు మాత్రం ఎలాంటి ప్యాకేజీలు ఇవ్వలేదని తెలిపారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.