: కేజ్రీవాల్ పై పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు
ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై బీజేపీ నేత నితిన్ గడ్కరీ దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్ ను ఈ రోజు ఢిల్లీ కోర్టు విచారణకు స్వీకరించింది. కేజ్రీవాల్ విడుదల చేసిన అవినీతి పరుల జాబితాలో తన పేరు చేర్చడంపై మండిపడ్డ గడ్కరీ పిటిషన్ వేశారు. తనపై అవాస్తవమైన, ఎలాంటి ఆధారాలు లేని, పరువుకు భంగం కలిగించే ప్రకటనలు చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు.