: ఆధార్ విషయంలో ఆందోళన వద్దు: సీఎం
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అత్యవసరంగా 300 ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్యాస్ రాయితీకి అధార్ నెంబర్ సమర్పణకు ఫిబ్రవరి 15 చివరి గడువు కాదన్నారు. ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పారు. ఆధార్ కార్డులపై సీఎం సచివాలయంలో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.