: తెలంగాణలో టీడీపీ తిరుగులేని విజయం సాధిస్తుంది: చంద్రబాబు
టీడీపీ ఖాళీ అయిందని అంటున్నారని... ఇతర పార్టీలు ఖాళీ అవుతాయే కాని టీడీపీ కాదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తెలంగాణ ప్రాంతంలో టీడీపీ తిరుగులేని విజయం సాధిస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో కొంత మంది నాయకులు పార్టీని వీడినా, కార్యకర్తలు మాత్రం పార్టీతోనే ఉన్నారని తెలిపారు. ఈ రోజు టీటీడీపీ నేతలతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. టీడీపీ పాలనలోనే తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. 'ఎన్నికలు సమీపిస్తున్నాయి... అన్ని విషయాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది' అని చెప్పారు.