: తిప్పలవలస తీరంలో 600 కిలోల చేప దొరికింది..!


తిప్పలవలస సముద్ర తీరంలో భారీ చేప దొరికింది. ఆ చేప బరువు ఒకటి, రెండూ కాదు.. ఏకంగా 600 కిలోలు ఉందని మత్స్యకారులు చెప్పారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం తిప్పలవలస సముద్ర తీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఆ భారీ చేప చిక్కింది. చేపను పడవలతో వారు ఒడ్డుకు తీసుకువచ్చారు. చేపను విక్రయించేందుకు విశాఖపట్నానికి తీసుకెళ్లనున్నట్లు వారు సంతోషంతో చెప్పారు. 600 కిలోల బరువు ఉన్న ఆ చేప మార్కెట్లో 15 నుంచి 20 వేల రూపాయల ధర పలుకుతుందని మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు కన్నయ్య చెప్పారు.

  • Loading...

More Telugu News