: భారత్.. ఇంట గెలవడం కాదు, రచ్చ గెలవాలంటున్న దాదా


స్వంత గడ్డపై ఆసీస్ ను వరుసగా మూడు టెస్టుల్లో ఓడించి సత్తా చాటిన భారత్.. టెస్టుల్లో నెంబర్ వన్ గా ఎదగాలంటే విదేశాల్లోనూ సత్తా చాటాలని మాజీ కెప్టెన్ గంగూలీ అంటున్నాడు. ఐసీసీ ర్యాంకుల్లో తొలి రెండు స్థానాల్లో ఉన్న దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ లను గమనిస్తే అవి ఇంటాబయటా విజయాలు సాధించాయని గుర్తు చేశాడు.

భారత్ కూడా అన్ని రకాల పరిస్థితుల్లోనూ నెగ్గే శక్తిసామర్థ్యాలు సొంతం చేసుకోగలదని భావిస్తున్నట్టు గంగూలీ చెప్పాడు. అయితే, ప్రస్తుత జట్టు యువకులతో నిండి ఉందని, వారు కుదురుకోవడానికి కొంచెం సమయమివ్వాలని అన్నాడు. కాగా, గత ఏడాది పరాభవాలను మర్చిపోయేందుకు తాజాగా ఆసీస్ పై సిరీస్ విజయం ఉపకరిస్తుందని దాదా పేర్కొన్నాడు. 

  • Loading...

More Telugu News