: తెలుగుదేశంపై కుట్ర పన్నడమే కాంగ్రెస్ పని: రేవంత్ రెడ్డి


టీటీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఆ పార్టీ నేత రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీపై కుట్ర పన్నడమే కాంగ్రెస్ పని అని ఆరోపించారు. ఇక రాహుల్ ముద్దపప్పు అయితే, జగన్ గన్నేరు పప్పు అని విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ తెలుగుదేశం సర్వసభ్య సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ఆకలికేకల నుంచి పుట్టిన పార్టీ టీడీపీ అని, ఆ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని సూచించారు. ఇక జగన్ పార్టీ గురించి రఘురామ రాజు, సబ్బంహరిని అడిగితే బాగా తెలుస్తుందన్న రేవంత్... జగన్, కిరణ్, సత్తిబాబు ఎవరూ చంద్రబాబు కాలిగోటికి సరిపోరన్నారు. తమ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తానన్న వ్యక్తి పావురాలగుట్టలో ఎగిరిపోయాడని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News