: కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ పొత్తా, విలీనమా?


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో ఆ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ సమావేశమయ్యారు. సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అయిన అహ్మద్ జాతీయ స్థాయిలో పార్టీకి సంబంధించిన ముఖ్య వ్యవహారాలను చూస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనమా? పొత్తా? అనే విషయమై ఈ భేటీలో నిర్ణయించే అవకాశం ఉంది. విలీనం, పొత్తుకు సంబంధించి అన్ని అంశాలను ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలిసింది. ఈ సమావేశం అనంతరం సోనియాగాంధీ ఆహ్వానిస్తే... కేసీఆర్ ఆమెను కలిసే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News