: మళ్ళీ పెరిగిన డీజిల్ ధర
దేశంలో చమురు ధరలు కళ్ళెం తెంచుకున్నట్టు కనిపిస్తోంది! చమురు సంస్థలు మరోసారి డీజిల్ ధరను లీటర్ కు 45 పైసలు పెంచుతున్నట్టు ప్రకటించాయి. ఈ ఏడాది డీజిల్ ధర పెంచడం ఇది మూడోసారి. కాగా, పెంచిన డీజిల్ ధరకు వ్యాట్ అదనం. తాజా ధరలు ఈ అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని దేశంలోని అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది.