: రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలి: టీజీ
రాయలసీమలోనే కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలని మంత్రి టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు రాజకీయ లబ్ధికోసమే కాంగ్రెస్ పార్టీ విభజనకు పాల్పడిందని ఆరోపించారు. అజెండాలో రాష్ట్ర విభజనను పెట్టి ఆమోదించి ఉంటే ముందే తప్పుకుని ఉండే వాళ్లమని తెలిపారు. ఇంకా ఎవరి కింద బతకాలి? అనే బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 'రన్ ఫర్ కర్నూల్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు.