: ఆమ్ ఆద్మీ జాబితాలో గాంధీ, శాస్త్రి కుటుంబీకులు


లోక్ సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ తన రెండో జాబితాను సిద్ధం చేసింది. ఇందులో మహాత్మా గాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి కుటుంబీకులు అభ్యర్థులుగా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో గాంధీ మనవడు, రచయిత రాజ్ మోహన్, శాస్త్రి మనవడు ఆదర్శ్ శాస్త్రి, గాయకుడు రబ్బీ షెర్గిల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులుగా ఏఏపీ పేర్కొంది. వీరిలో రాజ్ మోహన్ గాంధీ ఢిల్లీ లేదా ముంబయి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని సమాచారం. ఇక ఆదర్శ్ శాస్త్రి బీజేపీ నేత లాల్జి టాండన్ కు పోటీగా లక్నో నుంచి పోటీ చేయనున్నాడట. అటు రబ్బీ షెర్గిల్ అమృత్ సర్ నుంచి పోటీ చేస్తాడు.

  • Loading...

More Telugu News