: కెమెరా ముందు బంగ్లా క్రికెటర్ అసభ్య ప్రవర్తన


బంగ్లాదేశ్ క్రికెట్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు షకీబ్ అల్ హసన్. బంతిని గింగిరాలు తిప్పడమే కాదు, బ్యాట్ తోనూ విధ్వంసం సృష్టించగలడీ ఆల్ రౌండర్. ఇప్పటివరకు జట్టులో మంచి పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్న ఈ లెఫ్ట్ హ్యాండర్ తాజాగా తన అనుచిత ప్రవర్తనతో వార్తల్లోకెక్కాడు. శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా షకీబ్ 24 పరుగుల వద్ద అవుటయ్యాడు. డ్రెస్సింగ్ రూం చేరుకున్న షకీబ్ వైపు కెమెరా ఫోకస్ అయింది. దీంతో, ఆగ్రహించిన ఈ క్రికెటర్ తన కటిభాగాన్ని చిత్రీకరించుకోండి అన్నట్టు సంజ్ఞల ద్వారా కెమెరామన్ కు సూచించాడు. దీనిపై, బంగ్లా క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. షకీబ్ పై మూడు మ్యాచ్ ల నిషేధం విధించింది. తత్ఫలితంగా ఈ ఆల్ రౌండర్ లంకతో చివరి వన్డేతో పాటు ఆసియా కప్ లో బంగ్లా జట్టు ఆడే తొలి రెండు వన్డేలను మిస్సవుతాడు. అంతేగాకుండా, అతనిపై రూ.2.39 లక్షల జరిమానా కూడా విధించింది.

  • Loading...

More Telugu News