: కూరగాయలతో ఒకటి... బీపీ చెకప్ లతో మరొకటి... రెండు గిన్నిస్ రికార్డులు
రెండు గిన్నిస్ రికార్డులను భారతీయులు తమ సొంతం చేసుకున్నారు. పంజాబ్ లోని లూథియానాకు చెందిన రాన్ బాక్సీ ఉద్యోగులు తమ కంపెనీ ఆవరణలో కూరగాయలతో నేలపై గుండె ఆకారాన్ని అలంకరించారు. 480 చదరపు మీటర్ల స్థలంలో 19,825 కిలోల కూరగాయలతో వారు వేసిన ఈ ఆర్ట్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లోకి చేరనుంది. ఇక గుజరాత్ లోని వడోదర మునిసిపల్ కార్పొరేషన్ ఒకే రోజు 8 గంటల్లో 8,000 మందికి బీపీ పరీక్షలు నిర్వహించడం కూడా గిన్నిస్ రికార్డు నమోదు చేసింది.