: మల్కాజిగిరి నుంచి ఎంపీ, కుప్పం నుంచి ఎమ్మెల్యేగా చంద్రబాబు?
రానున్న ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇరు ప్రాంతాల (అప్పటికి రెండు రాష్ట్రాలు ఏర్పడకపోవచ్చు) నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్ మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది. ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకే ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అంతేకాకుండా, తెలంగాణ ప్రాంతం నుంచి ఆయన పోటీ చేయడం వల్ల... ఈ ప్రాంతంలో టీడీపీకి మరింత బలం పెరుగుతుందని పార్టీ భావిస్తోంది. మరో వైపు ఆయన సొంత నియోజవర్గం చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు.