: వచ్చే నెలలో ఆధార్ ఛైర్మన్ పదవికి నిలేకని రాజీనామా


ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఆ సంస్థ మాజీ సీఈవో నందన్ నిలేకని మార్చి చివరిలో ఆధార్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయనున్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై దక్షిణ బెంగళూరు నియోజకవర్గం నుంచి పోటీచేయనున్న నేపథ్యంలోని నిలేకని పదవి నుంచి వైదొలగనున్నారు. అయితే, ఎప్పుడు కాంగ్రెస్ లో చేరేది మాత్రం చెప్పలేదు. దానిపై ఆయన మాట్లాడుతూ, 'ఛైర్మన్ పదవిలో నేను కొన్ని రోజులే కొనసాగుతాను. మార్చి చివరిలో రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను' అని మీడియాకు తెలిపారు.

  • Loading...

More Telugu News