: నేడు ఈశాన్య రాష్ట్రాల్లో మోడీ ఎన్నికల శంఖారావం
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఈ రోజు ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో జరిగే బహిరంగసభల్లో పాల్గొని, ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ పాలనలో ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధికి దూరమయ్యాయని, తాము అధికారంలోకి వస్తే ఇక్కడి ప్రజల భవిష్యత్తును మార్చివేస్తామని మోడీ చెప్పబోతున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. మోడీ సభల నేపథ్యంలో, ఈ మూడు రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.