: తనపై కేసు కొట్టివేయాలని సోనియా పిటిషన్


అమెరికాలోని న్యూయార్క్ జిల్లా కోర్టులో తనపై దాఖలైన కేసును కొట్టివేయాలని కోరుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పిటిషన్ వేశారు. సిక్ ఫర్ జస్టిస్, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులు గతంలో ఇదే కోర్టులో సోనియాకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. అల్లర్లలో కాంగ్రెస్ నేతలు కమల్ నాథ్, సజ్జన్ కుమార్, జగదీష్ టైట్లర్ తో పాటు అమితాబ్ పాత్రపై విచారణ జరపకుండా సోనియా అడ్డుపడ్డారని.. కాబట్టి, ఆమె నుంచి నష్టపరిహారం ఇప్పించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలో సెప్టెంబర్ లో ఆమెకు కోర్టు నోటీసులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News