: విజయవాడలో లగడపాటి పోస్టర్ల కలకలం


'లగడపాటి త్యాగశీలి' అంటూ విజయవాడలో భారీ సంఖ్యలో వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. లోక్ సభలో టీబిల్లు ఆమోదం పొందిన వెంటనే క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు లగడపాటి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, లగడపాటి ఓ త్యాగశీలి... ఆయన రాజకీయాల్లో కొనసాగాలి అంటూ పోస్టర్లు వెలిశాయి. వీటిపై టీడీపీ శ్రేణులు విమర్శల వాన కురిపిస్తున్నాయి. లగడపాటే కొత్త డ్రామాకు తెరలేపారని ఆరోపిస్తున్నారు. రాజకీయాలకు దూరం కాలేకే పోస్టర్ల ద్వారా సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

  • Loading...

More Telugu News