: రూ.2,400 కోట్లతో టీటీడీ బడ్జెట్టు
2014-15 ఆర్ధిక సంవత్సరానికి గాను తిరుమల, తిరుపతి దేవస్థానం సుమారు రూ.2,400 కోట్లతో బడ్జెట్టును ఈ రోజు ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం జరగనుంది. భక్తులపై ఎలాంటి భారం మోపకూడదని టీటీడీ సంకల్పించింది. కానుకలు, తలనీలాలతోపాటు డిపాజిట్లపై వడ్డీల ద్వారా రాబడులను పెంచుకోవాలని నిర్ణయించింది. శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల ధరలను యథాతథంగా ఉంచాలని సంకల్పించింది.