: 'ఎర్త్ అవర్' కు అజయ్ దేవగణ్ మద్దతు


అవసరం లేని వేళల్లో విద్యుత్ దీపాలను, ఉపకరణాలను స్విచ్చాఫ్ చేయాలని ప్రజలకు పిలుపునిస్తున్నాడు బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవగణ్. తద్వారా విద్యుత్ పొదుపు చేయవచ్చని సూచించాడు. రేపు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించనున్న 'ఎర్త్ అవర్' కార్యక్రమానికి అజయ్ తన మద్దతు ప్రకటించాడు. కాలుష్యం కారణంగా పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పు దృష్ట్యా 'ఎర్త్ అవర్' లో గంటపాటు మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ విద్యుత్ ను ఆదా చేసి తద్వారా భూమిని కాపాడుకోవాలని చెప్పాడు.

  • Loading...

More Telugu News