: తిరుపతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేయాలి: చింతా మోహన్
ఢిల్లీలో ఈరోజు (శుక్రవారం) ప్రధాని మన్మోహన్ సింగ్ తో చిత్తూరు జిల్లా ఎంపీ చింతా మోహన్ భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన అంశంపై వీరిద్దరూ ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా చింతా మోహన్ తిరుపతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేయాలని ప్రధానిని కోరారు.