: 'ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు'... ఇప్పుడు ఒక్కటయ్యారు!


ఇండోనేషియాలో వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు, ఇప్పుడు ఇండియాలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఆంధ్రా అబ్బాయి.. ఇండోనేషియా అమ్మాయి ప్రేమించుకుని, ఆదిలాబాద్ జిల్లాలో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. జిల్లాలోని మంచిర్యాల మండల వాసి తామెర విక్రమ్ హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు పూర్తి చేసి, మాల్దీవుల్లోని ఓ హోటల్ లో మూడేళ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు.

ఇండోనేషియా దేశంలోని మలక్ పట్టణ వాసి అయిన సింటా కార్తికా సారియో కూడా హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చేసి, విక్రమ్ పనిచేస్తున్న హోటల్ లోనే ఉద్యోగం చేస్తోంది. సహోద్యోగులైన వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరి వివాహానికి తొలుత పెద్దలు అభ్యంతరం చెప్పినా, చివరకు ఒప్పుకున్నారు. దీంతో హిందూ సాంప్రదాయం ప్రకారం బంధుమిత్రుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది.

  • Loading...

More Telugu News