: తెలంగాణ బిల్లు ఆమోదం దేశానికి ‘డేంజర్ సిగ్నల్’: మమతా బెనర్జీ
పార్లమెంటులో తెలంగాణ ఆమోదం పొందిన తీరుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మరోసారి మండిపడ్డారు. కాంగ్రెస్-బీజేపీలు రెండూ కుమ్మక్కయి తెలంగాణ బిల్లును ఆమోదించాయని ఆమె ఆరోపించారు. తమ రాజకీయ లబ్ది కోసమే ఈ రెండు ప్రధాన పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు పూనుకొన్నాయని ఆమె చెప్పారు. ఇది దేశానికి ‘డేంజర్ సిగ్నల్’ అని మమత తేల్చి చెప్పారు.
ముఖ్యమైన విభజన బిల్లు వ్యవహారంలో ఈ రెండు పార్టీలు కుమ్మక్కు అయితే.. ఆ రెండు రాష్ట్రాల పరిస్థితి ఏమిటని మమతా బెనర్జీ ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, అప్రజాస్వామికమని ఆమె పునరుద్ఘాటించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని అడుగడుగునా మంట కలిపారని మమతా అన్నారు.