: సీమాంధ్రులను బాధపెట్టేలా మాట్లాడొద్దు... టి నేతలతో సోనియా
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ సాయంత్రం టి కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె వారితో పలు విషయాలు చర్చించారు. ముఖ్యంగా.. సీమాంధ్రులను బాధపెట్టేలా మాట్లాడొద్దని వారికి సూచించారు. 'ఇంతకుముందు మీరు బాధపడ్డారు, ఇప్పుడు వారు బాధపడుతున్నారు' అని టి నేతలతో మేడమ్ వ్యాఖ్యానించారు. సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.