: సీమాంధ్రులకు మిగిలింది... అప్పుల ఆంధ్రప్రదేశ్: టీడీపీ నేత యనమల
కాంగ్రెస్, బీజేపీ కలిసి సీమాంధ్రులకు అప్పుల ఆంధ్రప్రదేశ్ ను మిగిల్చారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. హైదరాబాదులో ఇవాళ యనమల మీడియాతో మాట్లాడారు. అప్పుల ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు కాంగ్రెస్, బీజేపీలదే బాధ్యత అని ఆయన అన్నారు. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లక్ష కోట్ల అప్పులు ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ ను బుందేల్ ఖండ్ స్థాయికి దిగజార్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్రకు ప్రధాని ప్రకటించిన ఆరు సూత్రాల ప్యాకేజీలో కొత్తదనమేదీ లేదని యనమల విమర్శించారు.