: సీమాంధ్రులను కట్టుబట్టలతో బయటికి పంపిస్తున్నారు: బాబు
మీడియాతో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు కేంద్రంపై విమర్శలు గుప్పించారు. సీమాంధ్రులను కట్టుబట్టలతో బయటికి పంపిస్తున్నారని మండిపడ్డారు. సీమాంధ్రకు ప్రణాళికబద్ధంగా హామీలు లభించలేదని పెదవి విరిచారు. సరైన నష్టపరిహారం అందలేదని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో నీటి పంపిణీ విషయమై ఇబ్బందులు తప్పవని బాబు హెచ్చరించారు. విభజన నేపథ్యంలో కేంద్రం చెబుతున్నట్టుగా సీమాంధ్రకు రాత్రికి రాత్రే పరిశ్రమలు రావని చెప్పారు. బిల్లు రాజ్యసభలో ఓడిపోతుందనే బీజేపీతో ఒప్పందం చేసుకున్నారని దుయ్యబట్టారు. ఇక, వైఎస్సార్సీపీపైనా బాబు ధ్వజమెత్తారు. విభజన అనంతరం ఆ పార్టీకి సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు.