: ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ అంటూ బురిడీ కొట్టించిన ముఠా గుట్టురట్టు
‘కౌన్ బనేగా కరోడ్ పతి’ లాటరీ పేరుతో అమాయక ప్రజలను ఆ ముఠా ఇంతకాలం నిలువునా ముంచింది. చివరకు హైదరాబాదు పోలీసుల చేతికి చిక్కింది. రియాల్టీ షోలలో ఎంతో పాప్యులారిటీ సంపాదించుకున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ మాదిరి లాటరీతో ఈ ముఠా సరికొత్త ఎత్తులతో ప్రజలను బోల్తా కొట్టించింది. పాకిస్థాన్ ను కేంద్రంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతోంది.
విశ్వసనీయ సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు ఈ ముఠాపై నిఘా పెట్టారు. చాకచక్యంగా వ్యవహరించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి డెబ్బైకి పైగా క్రెడిట్ కార్డులు, పలు నకిలీ డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.