: ఎగ్జామ్ హాల్లో బిడ్డకు జన్మనిచ్చింది!
నెలలు నిండిన ఓ అమ్మాయి ఎగ్జామ్ హాల్లో బిడ్డకు జన్మనిచ్చిన ఘటన బీహార్లో చోటు చేసుకుంది. సరన్ జిల్లాకు చెందిన మనీషా దేవి (20) చిన్న వయసులోనే వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న మనీషా నిన్న ఓ పరీక్షకు హాజరైంది. పరీక్షకు కూర్చున్న ఆమెకు కాసేపటికే నొప్పులు మొదలయ్యాయి. దీంతో, కళాశాల సిబ్బంది అంబులెన్స్ కు సమాచారం అందించారు. అయితే, అంబులెన్స్ వచ్చే లోపే మనీషా పండంటి శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డలను ఆసుపత్రికి తరలించారు. వారిరువురూ ఆరోగ్యంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.