: సల్మాన్ ఖాన్ పై కోర్టు ధిక్కారం కేసును తోసిపుచ్చిన బాంబే హైకోర్టు
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కోర్టును ధిక్కరించాడంటూ ఓ వ్యక్తి పెట్టిన కేసును బాంబే హైకోర్టు కొట్టివేసింది. వివరాల్లోకి వెళ్తే, సల్మాన్ తనపై ఉన్న కోర్టు కేసులకు సంబంధించి విచారణలపై సమగ్ర సమాచారాన్ని www.salmankhanfiles.com అనే వెబ్ సైట్ లో పొందుపరుస్తున్నాడు. తన కేసులకు సంబంధించిన వార్తలను మీడియాకు చేరవేసేందుకు ఈ సైట్ ఉపయోగపడుతుందని సల్మాన్ చెబుతున్నాడు. అయితే ఇలా చేయడం కోర్టు ధిక్కారం అంటూ ఓ వ్యక్తి న్యాయస్థానంలో ఫిర్యాదు చేశాడు. ఈరోజు (శుక్రవారం) దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఇది నిరుపయోగమైన ఫిర్యాదు అని తిరస్కరించింది. అంతేకాదు, ఫిర్యాదు చేసిన వ్యక్తికి న్యాయస్థానం రెండు వేల రూపాయల జరిమానా కూడా విధించింది.