: ఇక, వంటగ్యాస్ కు ‘ఆధార్’ అక్కర్లేదు...!


వంటగ్యాస్ వినియోగదారులు ఇక నుంచి ఆధార్ కార్డు లేకుండానే సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు పొందవచ్చని ప్రభుత్వం ఈరోజు లోక్ సభకు తెలిపింది. ‘‘దీనికి సంబంధించి ఈ వారంలోనే ఒక వివరణ జారీ చేస్తాం’’ అని పెట్రోలియం, సహజ వాయువు శాఖామంత్రి వీరప్ప మొయిలీ ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు.

పార్లమెంటు సభ్యులకు వంటగ్యాస్ కనెక్షన్ల కూపన్లు ఇవ్వాలని లోక్ సభలో ఓ ఎంపీ మొయిలీని కోరారు. కూపన్లు ఇచ్చిన పక్షంలో తమ నియోజకవర్గంలో అత్యవసరంగా అవసరమైన వారికి ఆ కూపన్ల ద్వారా వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని ఆ ఎంపీ మంత్రికి వివరించారు. ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని వీరప్ప మొయిలీ బదులిచ్చారు.

  • Loading...

More Telugu News