: కిరణ్ పై విచారణ జరిపిస్తాం: టీకాంగ్రెస్ ఎమ్మెల్సీలు


రాష్ట్ర విభజనకు నిరసనగా పదవికి, పార్టీకి రాజీనామా చేసిన కిరణ్ పై తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్సీలు జగదీశ్వర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, యాదవ రెడ్డిలు ధ్వజమెత్తారు. ఆరు నెలల ముందు నుంచి కిరణ్ తీవ్ర అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం చేత కిరణ్ అవినీతిపై విచారణ జరిపిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు సోనియాకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజల గుండెల్లో సోనియా చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు.

  • Loading...

More Telugu News