: 'న.మో' చాయ్.. 'రా.గా' మిల్క్
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో దేశంలో రాజకీయ స్పర్థ రగులుకుంటోంది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ 'చాయ్ పే చర్చ' పేరిట సామాన్యులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండగా... కాంగ్రెస్ అందుకు కౌంటర్ వేసింది. రాహుల్ గాంధీ మిల్క్ పేరిట ఉచితంగా పాలు అందిస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో కాంగ్రెస్ నేతలు రా.గా (రాహుల్ గాంధీ) మిల్క్ పేరిట రోడ్డుపై వెళ్ళేవారికి ఉచితంగా పేపర్ కప్పుల్లో పాలు అందించారు. నగరంలోని ప్రతి బ్లాక్ లో రోజుకు 50 లీటర్ల పాలను ఉచితంగా సరఫరా చేయాలని నిర్ణయించుకున్నామని గోరఖ్ పూర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ జమాల్ తెలిపారు. దీని ద్వారా తామిచ్చే సందేశం సుస్పష్టమని పేర్కొన్నారు. టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని, మోడీ పాలన దేశ ఆరోగ్యానికి మంచిది కాదని, పాలే సర్వశ్రేష్టమని తెలిపారు.