: కిరణ్ పై రఘువీరా విమర్శనాస్త్రాలు
క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ ను వదిలిపోవడం పిరికి చర్య అవుతుందని రాష్ట్ర మంత్రి రఘువీరా రెడ్డి అన్నారు. అది కిరణ్ అయినా లేక మరెవరైనా ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని వీడటం మంచిది కాదని తెలిపారు. ఈ రోజు హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే రాష్ట్ర విభజన జరగలేదని, అన్ని పార్టీల సహకారంతోనే జరిగిందని రఘువీరా స్పష్టం చేశారు. కాంగ్రెస్ ను నమ్ముకుంటే ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు.