: లోక్ సభలో భజ'గోవిందం'!


కోనేటి రాయుడన్నా.. ఏడుకొండలవాడన్నా.. గోవిందుడన్నాఒక్కటే. అన్నీ ఆ తిరుపతి వేంకటేశ్వరుడి పేర్లే. అయితే, భక్తులు తాము ఆపదల్లో ఉన్నప్పుడో, భక్తి తాదాత్మ్యంలో మునిగిపోయినప్పుడో అప్రయత్నంగా నోట పలికేది 'గోవిందా' అనే. ఇప్పుడా గోవింద నామస్మరణ.. తిరుపతి కొండలు, భక్తుల నివాసాలు దాటి భారత పార్లమెంటులోనూ ప్రతిధ్వనిస్తోంది.

చట్టాలు, తీర్మానాలు చేయాల్సిన పార్లమెంటులో భజగోవిందం ఏమిటనకుంటున్నారా..! అయితే ఓవర్ టు లోక్ సభ. కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన లోక్ సభ సమావేశాల్లో ఎక్కువసార్లు సభా సమయం వృధా కావడంతో  తెలుగుదేశం సభ్యులు 'గోవిందా గోవింద' అంటూ వినూత్నరీతిలో నిరసన తెలపడం ప్రారంభించారు.

ఈ విలక్షణ సంప్రదాయాన్ని ఆరంభించిన టీడీపీ ఎంపీలు ఎన్. శివప్రసాద్, మోదుగుల వేణుగోపాలరెడ్డి సభ ఎప్పుడు వాయిదా పడినా, గోవింద నామస్మరణతో హోరెత్తిస్తున్నారు. ఇక వీరిని ఆదర్శంగా తీసుకుని మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక సభ్యులూ 'గోవిందా గోవింద' అంటూ వారికి వంత పాడుతున్నారట. 

  • Loading...

More Telugu News