: బీహార్ లో చిచ్చు పెట్టిన సీమాంధ్ర ప్రత్యేక ప్రతిపత్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో, సీమాంధ్రకు ఐదేళ్ల పాటు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే విషయం ఇతర రాష్ట్రాల్లో చిచ్చు రేపుతోంది. తాము ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నా, యూపీఏ ప్రభుత్వం తమకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వలేదని బీహార్ వాసులు వాపోతున్నారు. దీనికి నిరసనగా మార్చి 1న రాష్ట్ర బంద్ కు బీహార్ సీఎం నితీష్ కుమార్ పిలుపునిచ్చారు.