: తెలంగాణ ఏర్పాటు ఘనత బీజేపీదే: కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఘనత భారతీయ జనతాపార్టీదేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ చురుగ్గా ప్రజల్లోకి వెళ్తుందని ఆయన చెప్పారు. ఆయన న్యూఢిల్లీలో ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఆదివారం నాడు హైదరాబాదులో బీజేపీ తెలంగాణ నేతల సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ కోసం ఉద్యమించిన ఏకైక జాతీయ పార్టీ బీజేపీయేనని ఆయన తేల్చి చెప్పారు.