: టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న మంత్రి గంటా
మంత్రి గంటా శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీని వీడి, తన రాజకీయ ప్రవేశానికి పునాది వేసిన టీడీపీలోకే (తర్వాత టీడీపీ నుంచి పీఆర్పీలోకి వెళ్లారు) చేరతారని గత కొంత కాలంగా వార్తలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సొంత గూటికి చేరడానికి సమయం ఆసన్నమయినట్టు కనిపిస్తోంది. వచ్చే నెల 8న చంద్రబాబు సమక్షంలో ఆయన సైకిలెక్కనున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి విశాఖపట్నంలో టీడీపీ నేతలతో గంటా చర్చలు జరుపుతున్నారు.