: నావికులకు మరణశిక్ష పడదని ఇటలీకి హామీ ఇచ్చిన భారత్
కేరళ జాలర్లను హత్య చేసిన కేసులో ఇద్దరు ఇటలీ నావికుల భవిష్యత్తుపై భారత్ ప్రభుత్వం
ఇటలీకి స్పష్టమైన హామీ ఇచ్చింది. తమ నావికులకు మరణశిక్ష విధిస్తారేమోనని ఇటలీ భయపడుతోంది. అందుకే, వారిని తిరిగి పంపేది లేదని ఇటలీ మొండికేసింది. అయితే, వారికి మరణ శిక్ష విధించడం జరగదనీ, భారత్ లో అరుదైన కేసుల్లో అరుదుగా మాత్రమే మరణశిక్ష విధిస్తారనీ మన దేశం వారికి హామీ ఇవ్వడంతో తమ నావికులను పంపడానికి ఇటలీ అంగీకరించింది. ఈ సాయంత్రానికి నావికులు ఢిల్లీ చేరుకుంటారు.