: నడుస్తున్న ఫ్లయిట్ లో.. షాకింగ్ షారూక్
షారూక్ అంటే అందరికీ పిచ్చే! అభిమాన నటుడు కనిపిస్తే ఉన్నది ఫ్లయిట్ లో అన్న విషయాన్ని కూడా మర్చిపోతామని ప్రయాణికులు నిరూపించారు. మలేసియా పర్యటన ముగించుకుని నటుడు షారూక్ ఖాన్ ముంబై తిరిగి వస్తున్నారు. షారూక్ ను చూసేసరికి విమాన పైలట్, సిబ్బందిలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. ఫ్లయిట్ లో బాలీవుడ్ బాద్షా ఉన్నాడని అనౌన్స్ చేసేశారు. ఇంకేముంది చేతులు కలిపేవాళ్లు కొందరైతే.. ఆటోగ్రాఫ్ కోసం ఎగబడే వాళ్లు మరి కొందరు. మొత్తానికి షారూక్ చుట్టూ చేరి నానా హంగామా చేసేశారు. వారిని నియంత్రించడం సిబ్బంది వల్ల కూడా కాలేదట.