: ఒబామాతో దలైలామా భేటీ రద్దు చేయండి.. అమెరికాకు చైనా విజ్ఞప్తి
ఆసియా పెద్దన్న చైనా మరోసారి దలైలామాపై తన వ్యతిరేకతను ప్రదర్శించింది. టిబెట్ విషయంలో అడుగడుగునా అడ్డం తగిలే ఆధ్యాత్మిక గురువు దలైలామాతో అమెరికా అధ్యక్షుడు ఒబామా భేటీ అవరాదని అంటోంది. ఈ మేరకు వారిద్దరి సమావేశాన్ని రద్దు చేయాలని అమెరికాకు విజ్ఞప్తి చేసింది. చైనా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే దలైలామాతో అమెరికా చర్చల విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్ యింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. టిబెట్ వ్యవహారంలో మరో దేశం జోక్యం చేసుకోవడాన్ని చైనా సహించబోదని ఆమె స్పష్టం చేశారు.